చేయవలసినవి
- బ్యాంకును సంప్రదించే వివరాల కొరకు ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైటును సందర్శించండి
- బ్యాంకుతో మీ సంప్రదించగల వివరాలను ఎల్లప్పుడూ నవీకరించు కోండి మరియు లావాదేవీ అలర్ట్స్ ను అందుకోవడానికి సబ్‌స్క్రైబ్ చేయండి
- మీ కంప్యూటర్ / మొబైల్ పై నికార్సయిన యాంటి-వైరస్ మరియు యాంటి-మాల్వేర్ సాఫ్ట్ వేర్ ను ఇన్స్టాల్ చేయండి మరియు దానిని నవీకరించి ఉంచండి
- బలమైన మరియు ప్రత్యేకమైన పాస్ వర్డ్ ఎంచుకోండి.
- మీ కార్డు నంబరును, పాస్వర్డ్స్ లేదా మరే ఇతర వ్యక్తిగత సున్నితమైన సమాచారాన్ని స్టోరు చేయబడకుండా చూడడానికి, మీ బ్రౌజరు యొక్క ఆటోకంప్లీట్ సెట్టింగ్స్ ను ఆపివేయండి
- ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి యాప్స్ వేటినైనా డౌన్లోడు చేసుకునే ముందు జాగ్రత్త వహించండి
- లావాదేవీ జరుపుతున్నప్పుడు మీ వెబ్ బ్రౌజర్ స్టేటస్ బార్ లో తాళం గుర్తు లేదా https కొరకు చూడండి
- సున్నితమైన వివరాలను షేర్ చేసుకోమని అడిగే మెసేజ్‌లలో ఎల్లప్పుడూ స్పెల్లింగ్ తప్పుల కొరకు తనిఖీ చేయాలి, కారణం మోసపూరితమైన వాటిని గుర్తించడానికి అవి మీకు సహాయపడతాయి.
చేయకూడనివి
- పిన్, పాస్వర్డులు, ఒటిపి లేదా కార్డు వివరాలు లాంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ ఎప్పుడూ పంచుకోకండి.
- మీ బ్యాంకు ఖాతాను సందర్శిస్తున్నప్పుడు పబ్లిక్ వైఫై లేదా ఉచిత విపిఎన్ / పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించడం మానండి.
- తెలియని మూలాధారాలు / సెండర్ ఐడిల నుండి అందుకున్న లింక్స్ పైన ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
- 123456, పేర్లు, పుట్టిన తేదీ మొదలయినటువంటి సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డులను ఉపయోగించవద్దు
- మీ బ్యాంకింగ్ పాస్వర్డును ఎక్కడా కూడా వ్రాయడం మరియు దానిని బ్రౌజర్లపై సేవ్ చేయడం మానుకోవాలి.
- ఎనీ డెస్క్ వంటి రిమోట్ షేరింగ్ యాప్ లను డౌన్ లోడు చేయవద్దు
- యుపిఐ ద్వారా డబ్బును అందుకోవడానికి క్యుఆర్ కోడును స్కాన్ చేయవద్దు లేదా పిన్ లేదా ఒటిపి ని నమోదు చేయవద్దు
ఎటిఎమ్
వద్ద అపరిచితుల నుండి సహాయం తీసుకోవద్దు
గుర్తుంచుకోండి
కోటక్ మహీంద్రా బ్యాంక్ లేదా వారి ఉద్యోగులు / ప్రతినిధులు మీ వ్యక్తిగత ఖాతా సమాచారాన్ని ఎప్పుడూ అడగరు.